ట్రెండింగ్
Epaper    English    தமிழ்

3M+ వ్యూస్ ని సాధించిన 'యాత్ర 2' ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 05, 2024, 06:49 PM

ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా 2019లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. మహి వి రాఘవ్  దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్‌ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ఫిబ్రవరి 8, 2024న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.


ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు , ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ లో 3 మిలియన్ వ్యూస్ ని సాధించినట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.

దివంగత రాజకీయ నాయకుడు వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్ పాత్రలో స్టార్ హీరో జీవా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నారా చంద్రబాబు నాయుడుగా మహేష్ మంజ్రేకర్, సోనియాగాంధీగా సుజానే బెర్నార్డ్, వైఎస్ భారతిగా కేతకి నారాయణన్ నటిస్తున్నారు.


నిర్మాణ సంస్థలు V సెల్యులాయిడ్ మరియు త్రీ ఆటం లీవ్స్ ఈ గ్రిప్పింగ్ పొలిటికల్ థ్రిల్లర్ ని నిర్మిస్తున్నాయి. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa