24 ఏళ్ల తరువాత సినీ నటుడు అజిత్, టబు జంటగా నటించనున్నారు. మే 4, 2000లో విడుదలైన ‘ప్రియురాలు పిలిచింది’లో వీరిద్దరూ కలిసి స్క్రీన్ పంచుకున్నారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా అజిత్ ‘ఏకే 63’ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అజిత్‌కి జోడీగా టబును ఎంపిక చేసింది చిత్రబృందం. ప్రతినాయకుడి పాత్రలో అరవింద్‌స్వామి, మరో కీలక పాత్రలో ఎస్.జె.సూర్య కనిపించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa