ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధనుష్ - నాగార్జున సినిమాకి ఆన్ బోర్డు లో జిమ్‌ సర్భ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 26, 2024, 05:37 PM

కోలీవుడ్ నటుడు ధనుష్ ఒక స్ట్రెయిట్ తెలుగు చిత్రం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి తాత్కాలికంగా D51 అనే పేరును పెట్టారు. ఈ చిత్రం అధికారికంగా హైదరాబాద్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి జిమ్‌ సర్భ్ ఆన్ బోర్డు లో ఉన్నట్లు చిత్ర బృందం ఆన్లైన్ ద్వారా వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

ఈ ప్రాజెక్ట్‌లో రష్మిక మందన్న మహిళా ప్రధాన పాత్రను పోషించనుంది. అక్కినేని నాగార్జున ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నికేత్ బొమ్మి ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సహకారంతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్ యొక్క యూనిట్), సోనాలి నారంగ్ సమర్పణలో ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa