ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రవితేజకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'హనుమాన్' టీమ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 26, 2024, 05:18 PM

పాన్ ఇండియా రేంజ్ లో ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన సూపర్ హీరో సినిమా 'హను-మాన్' లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రం జనవరి 12, 2024న వెండితెరపైకి వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోళ్లా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో 'కోటి' గాడు ఆక కోతికి వాయిస్ ఓవర్ అందించిన రవితేజకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది.

అమృత అయ్యర్ ఈ సినిమాలో తేజ సరసన నటిస్తుంది. ఈ సినిమాలో వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్, దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, సత్య మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. అనుదీప్ దేవ్, హరి గౌర, జై క్రిష్ మరియు కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లు అందిస్తున్నారు. కె నిరంజన్ రెడ్డి తన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై హను-మాన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa