ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెన్నైలో ప్రారంభమైన 'థగ్ లైఫ్' షూటింగ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 26, 2024, 04:40 PM

ఉలగనాయగన్ కమల్ హాసన్ మరియు స్టార్ దర్శకుడు మణిరత్నం దాదాపు 17 సంవత్సరాల తర్వాత కలిసి ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి థగ్ లైఫ్ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా తొలి షెడ్యూల్ ని చెన్నై లో ప్రారంభించినట్లు సమాచారం.

ఈ సినిమాలో  త్రిష కృష్ణన్, ఐశ్వర్య లక్ష్మి , దుల్కర్ సల్మాన్, గౌతమ్ కార్తీక్ మరియు జయం రవి కీలక పాత్రలో నటిస్తున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ మరియు మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్, మరియు శివ అనంతి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa