ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయోధ్యలోని రామమందిరం దగ్గర ప్లాట్ కొనుగోలు చేసిన లెజెండరీ స్టార్ హీరో

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 15, 2024, 06:46 PM

ఈ నెల 22న అయోధ్యలో రామమందిరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ ఆలయ ట్రస్ట్‌కు పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చినట్లు సామాచారం. తాజాగా ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఆలయానికి సమీపంలో 15 కోట్ల విలువైన ప్లాట్‌ను కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సరయు నదికి దగ్గరగా ఉన్న 'ది సరయు ఎన్‌క్లేవ్‌' లో అమితాబ్‌ బచ్చన్‌ భూమిని కొనుగోలు చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ముంబైకి చెందిన అభినందన్ లోధా కంపెనీ ప్లాట్‌ను డెవలప్ చేస్తోందని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ విషయానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa