ట్రెండింగ్
Epaper    English    தமிழ்

USAలో 'గుంటూరు కారం' ను క్రాస్ చేసిన హనుమాన్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 15, 2024, 06:13 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ సూపర్ హీరోగా నటించిన పాన్ ఇండియన్ చిత్రం హనుమాన్ జనవరి 12, 2024న  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల పోస్టివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. హనుమాన్ ఇప్పుడు USA ప్రాంతంలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాని అధిగమించాడు.


తాజా సమాచారం ప్రకారం హనుమాన్ దాదాపు $2.4 మిలియన్లు వసూలు చేయగా, గుంటూరు కారం ప్రస్తుతం USA బాక్స్ఆఫీసు వద్ద $2.2 మిలియన్ వసూళ్లు చేసింది. అనుదీప్ దేవ్, హరి గౌర, జై క్రిష్ మరియు కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లు అందిస్తున్నారు. అమృత అయ్యర్, వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa