స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్టన్నింగ్ లుక్ లో మెరుస్తూ ఆకట్టుకుంటున్నారు. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. తాజాగా బ్యూటీఫుల్ ఫొటోలను షేర్ చేసింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. స్టార్స్ సరసన నటించి ఆడియెన్స్ ను మెప్పించింది. ఇండస్ట్రీలో తనకుంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ ఐదేళ్లుగా సినిమాలు చేయడం లేదు. చివరిగా ‘కొండపొలం’ మూవీతో అలరించింది. ఆ తర్వాత నార్త్ ఆడియెన్స ను అలరించేందుకు నడుముం బిగించింది. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.2022 మొత్తం బాలీవుడ్ లో సందడి చేసింది. ఈ ముద్దుగుమ్మ హిందీలో చేసిన సినిమాల సంఖ్య చూస్తే మతిపోవాల్సిందే. ఆ ఏడాది ఏకంగా ఐదు సినిమాల్లో నటించి షాకిచ్చింది. కానీ పెద్దగా సక్సెస్ ను అందుకోలేదు. దీంతో ఇప్పుడు నార్త్ లో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోతోంది. ఈ క్రమంలో మళ్లీ సౌత్ లోనే దృష్టిసారిస్తోంది. వరుసగా ఆఫర్లు దక్కించుకుంటోంది. తెలుగు, తమిళంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. మూవీ అప్డేట్స్ అందిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ అదరగొడుతోంది. తన గురించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులకు అందిస్తూ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ ఫొటోషూట్లతో కట్టిపడేస్తోంది. తాజాగా లెహంగా వోణీలో పద్ధతిగా మెరిసినా అందచందాలతో చూపుతిప్పుకోకుండా చేసింది. డీప్ కట్ బ్లౌజ్ లో టాప్ గ్లామర్ ను ప్రదర్శించింది. మత్తెక్కించే ఫోజులతో మతులు పోగొట్టింది. మెరిసిపోయే అందంతో మంత్రముగ్ధులను చేస్తోంది.
#RakulPreetSingh pic.twitter.com/SZNoWmfvCU
— VD bulletin (@vdbulletin) January 12, 2024
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa