ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగురాష్ట్రాల్లో 'కెప్టెన్ మిల్లర్' ని విడుదల చేయనున్న ప్రముఖ ప్రొడక్షన్ హౌసెస్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 12, 2024, 07:03 PM

అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'కెప్టెన్ మిల్లర్' సినిమా  యొక్క తమిళ వెర్షన్ జనవరి 12, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ ని జనవరి 25, 2024న విడుదల కానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రాన్ని ఆంధ్రాప్రదేశ్ అండ్ తెలంగాణలో సురేశ్‌ప్రొడక్షన్స్ మరియు ఏషియన్ సినిమాస్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి అధికారకంగా ప్రకటించింది.

ఈ యాక్షన్ థ్రిల్లర్ లో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, ప్రియాంక అరుల్ మోహన్, సందీప్ కిషన్, నివేదిత సతీష్, ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa