ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'హనుమాన్' తెలుగురాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ రిపోర్ట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 12, 2024, 05:54 PM

పాన్ ఇండియా రేంజ్ లో ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన సూపర్ హీరో సినిమా 'హను-మాన్' లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రం జనవరి 12, 2024న వెండితెరపైకి వచ్చింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో 20.65 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సామాచారం.

అమృత అయ్యర్ ఈ సినిమాలో తేజ సరసన నటిస్తుంది. ఈ సినిమాలో వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్, దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, సత్య మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. అనుదీప్ దేవ్, హరి గౌర, జై క్రిష్ మరియు కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లు అందిస్తున్నారు. కె నిరంజన్ రెడ్డి తన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై హను-మాన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


'హనుమాన్' ప్రీ రిలీజ్ బిజినెస్ :::::
నైజాం : 7.15 కోట్లు
సీడెడ్ : 4 కోట్లు
ఆంధ్రప్రదేశ్ : 9.50 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 20.65 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa