ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓపెన్ అయ్యిన 'సైంధవ్' బుకింగ్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 12, 2024, 04:40 PM

శైలేష్ కొలను దర్శకత్వంలో టాలీవుడ్ హీరో వెంకటేష్ తన 75వ సినిమాని అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'సైంధవ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా జనవరి 13, 2024న థియేటర్‌లలో విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం యొక్క బుకింగ్ ఓపెన్ అయ్యినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తుంది. ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ లో బేబీ సారా, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్, రుహాని శర్మ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa