టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న గ్రాండ్ గా విడుదలైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం USAలో $1.2 మిలియన్ మార్క్ ని చేరుకున్నట్లు మూవీ మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం ఆన్లైన్ లో పోస్టర్ ని విడుదల చేసారు.
శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. ఈ బిగ్గీలో ప్రకాష్ రాజ్, జగపతి బాబు, రమ్యకృష్ణ, ఈశ్వరీ రావు, రావు రమేష్ మరియు వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ స్వరాలు సమకూర్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa