త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన తాజా తెలుగు చిత్రం 'గుంటూరు కారం' ఈరోజు గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ యాక్షన్ డ్రామాలో శ్రీలీల మరియు మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సుదర్శన్ 35 మిమీ వద్ద తన అభిమానులతో కలిసి గుంటూరు కారం సినిమాని చూసినట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, జయరామ్, రమ్య కృష్ణన్, వెన్నెల కిషోర్, ఈశ్వరీ రావు మరియు ఇతర ప్రముఖ నటీనటులు కీలక పత్రాలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa