ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శెరవేగంగా కొనసాగుతున్న థ‌గ్ లైఫ్‌

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 12, 2024, 02:14 PM

విశ్వ‌ నాయకుడు కమల్ హసన్, మణిరత్నం, ఏఆర్ రెహమాన్ కలయికలో వస్తున్న కొత్త చిత్రం థ‌గ్ లైఫ్‌. రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌, మద్రాస్‌ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ న‌వంబ‌ర్‌7న కమల్ జన్మదినం సందర్భంగా ప్రారంభించి సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ తో పాటు ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. 36 సంవత్సరాల తర్వాత కమల్ హసన్, మణిరత్నం కలయికలో నాయకన్ వంటి కల్ట్ క్లాసిక్ త‌ర్వాత‌ రూపొందుతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై దేశమంతటా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ సినిమాలో ఇప్ప‌టికే తమిళ స్టార్ జయం రవి, పాన్ ఇండియా స్టార్ దుల్హర్ సల్మాన్ , త్రిష వంటి స్టార్ క్యాస్ట్ న‌టిస్తుండ‌డంతో పాటు జాతీయ ఆవార్డు టెక్నీషియన్స్ చాలా మంది ఈ సినిమాకు పని చేస్తుండ‌గా తాజాగా ఈ సినిమాలో త‌మిళ న‌టుడు గౌత‌మ్ కార్తీక్ , మ‌ళ‌యాళ న‌టుడు జోజు జార్జ్ వంటి మ‌రో ఇద్ద‌రు కొత్త స్టార్స్ న‌టిస్తున్న‌ట్లు మేక‌ర్స్ ఈ రోజు (బుధ‌వారం) అధాక‌రికంగా ప్ర‌క‌టించారు ఈ సందర్బంగా వారికి ఆహ్వనం పలుకుతూ మేకర్స్ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఇప్పుడు ఈ సినిమాకు చెందిన వార్తలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో కమల్ హాసన్ పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్ కాగా సినిమాలో దొంగ, క్రిమినల్ గా కనపడనున్నారని ఈ చిత్రం టీజ‌ర్‌ను బ‌ట్టి తెలుస్తోంది. అయితే ఇది గ‌తంలో వ‌చ్చిన నాయ‌కుడు చిత్రానికి సీక్వెల్ అని నెట్టింట వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఎందుకంటే 'నాయకుడు' సినిమాలోనూ కమల్ హాసన్ పేరు శక్తివేల్ నాయకర్  కావ‌డంతో ఈ సినిమాకు దానికి ఏమైనా లింక్‌ ఉండే అవ‌కాశం ఉండొచ్చ‌ని నెటిజ‌న్స్‌ అంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమా టీజ‌ర్‌లో చూయించిన 80 శాతం విజువ‌ల్స్‌ హాలీవుడ్ సినిమా 'రైజ్ అఫ్ స్కై వాకర్' ను పోలి ఉండ‌డంతో ఈ సినిమాను కాఫీ చేస్తున్నార‌నే రూమ‌ర్స్‌గా గ‌ట్టిగా వినిపిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa