ఈ సంక్రాంతికి గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ, హనుమాన్ తదితర తెలుగు చిత్రాలు విడుదల కానుండటంతో డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టంగా మారింది. ఇప్పటికే తేదీలను ప్రకటించుకున్న లాల్ సలామ్, అయలాన్, కెప్టెన్ మిల్లర్, మిషన్ ఛాప్టర్-1 వంటి డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు దొరకలేదు. దీంతో సంక్రాంతి బరిలో నుంచి ఒక్కో డబ్బింగ్ సినిమా తప్పుకోవడం మొదలైంది. ఇప్పటికే అయలాన్, లాల్ సలామ్ తెలుగులో విడుదలను వాయిదా వేశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa