బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి చెప్పేదేముంది. గ్లామర్, చలాకీతనం ఆమెకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్. అందంతో కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తూనే.. స్పీకర్లు పగిలిపోయేలా గోల చేయడం ఆమె శైలి.బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి చెప్పేదేముంది. గ్లామర్, చలాకీతనం ఆమెకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్. అందంతో కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తూనే.. స్పీకర్లు పగిలిపోయేలా గోల చేయడం ఆమె శైలి. అందుకే శ్రీముఖి పాల్గొనే షోలలో పెద్ద హంగామా ఉంటుంది. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుపులు మెరిపించాలని ఈ హాట్ యాంకర్ భావిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది.బిగ్ బాస్ సీజన్ 3లోశ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ కి గట్టి పోటీ ఇచ్చింది. తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ చివరకు శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకుంది. రాహుల్ విజేతగా నిలిచాడు. శ్రీముఖి చివరగా 'క్రేజీ అంకుల్స్' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే శ్రీముఖి రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ చిత్రంలో నటించింది. చిరుతో కలసి ఖుషి నడుము సీన్ రీ క్రియేట్ చేసింది. అయితే దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది. చంద్రబింబం లాంటి అందమైన రూపం శ్రీముఖి సొంతం. తరచుగా ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. ఇటీవల శ్రీముఖి గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేస్తోంది. అందంగా మాత్రమే కాదు హాట్ గా కూడా కనిపించాలని డిసైడ్ అయినట్లు ఉంది. నిండైన బట్టల్లో తన అసలు సిసలైన సొగసుతో మెస్మరైజ్ చేస్తోంది. చిట్టి పొట్టి డ్రెస్సుల్లో మాత్రమే కాదు.. ఇలా నిండైన వస్త్రధారణలో కూడా తాను అందంగా ఉంటానని శ్రీముఖి చెప్పకనే చెబుతోంది. తాజాగా ఇయర్ ఎండ్ లో శ్రీముఖి మైండ్ బ్లోయింగ్ ట్రీట్ ఇచ్చింది. స్కై బ్లూ కలర్ లాంగ్ గౌన్ లో శ్రీముఖి పోతున్న హొయలు ఊరిస్తున్నాయి.
Super Singer
Tonight on @StarMaa #sreemukhi #supersinger #starmaa pic.twitter.com/BzSTLGva8A
— SreeMukhi (@MukhiSree) December 30, 2023
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa