నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డెవిల్’. అభిషేక్ నామా స్వీయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాపై ట్విట్టర్ (ఎక్స్)లో పాజిటివ్ టాక్ వస్తోంది. సినిమా బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కల్యాణ్ రామ్ వన్‌మ్యాన్ షో అని చెబుతున్నారు. ఫస్టాఫ్ యావరేజ్ అని, సెకండాఫ్ బాగుందని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa