కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తన తదుపరి చిత్రాన్ని వెంకట్ ప్రభుతో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి తాత్కాలికంగా 'తలపతి 68' అనే టైటిల్ పెట్టారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో విజయ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, డిసెంబరు 31, 2023న ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్‌లుక్ పోస్టర్ ని విడుదల చేయటానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో విజయ్ సరసన హ్యాపెనింగ్ నటి మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్చన కలాపతి, కళపతి ఎస్ అఘోరం, కలపతి ఎస్ గణేష్, కళపతి ఎస్ సురేష్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa