పరశురామ్ పెట్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక ప్రాజెక్ట్ ని చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాకి "ఫ్యామిలీ స్టార్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు, న్యూయార్క్‌లో ని టైమ్స్ స్క్వేర్ పై ఫ్యామిలీస్టార్ గ్లింప్స్ ని స్క్రీనింగ్ చేసారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో వీడియోని షేర్ చేసి అధికారకంగా ప్రకటించింది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో రష్మిక మందన్న ఒక ప్రత్యేక పాటలో కనిపించనున్నట్లు సమచారం. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa