ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూర్య 'కంగువ' షూటింగ్ గురించి తాజా అప్‌డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 19, 2023, 03:52 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన తదుపరి సినిమాని దర్శకుడు సిరుత్తై శివతో అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకు 'కంగువ' అనే టైటిల్‌ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం యొక్క యాక్షన్ ప్యాక్డ్ టీజర్ అభిమానులలో మరియు ట్రేడ్ వర్గాల్లో అంచనాలను పెంచింది.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ప్రస్తుతం చిత్రబృందం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుతున్నట్లు ఆసక్తికర వార్త హల్‌చల్ చేస్తోంది. బాబీ డియోల్ మరియు ఇతరులు ఇప్పటికే ఈ షెడ్యూల్‌లో భాగమయ్యారు మరియు సూర్యా రెండు రోజుల్లో ఈ షెడ్యూల్ లో జాయిన్ అవ్వనున్నట్లు సమాచారం. ఈ షూట్‌లో సూర్య పార్ట్‌లు పూర్తవుతాయని సమాచారం.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దిశా పటానీ సూర్య సరసన జోడిగా నటిస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌కి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్లపై వంశీకృష్ణ, ప్రమోద్, కెఇ జ్ఞానవేల్రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa