కొన్ని సినిమాలు విడుదలైనప్పుడు చరిత్ర సృష్టించకపోయినా, కాలం గడిచేకొద్దీ కల్ట్ క్లాసిక్ చిత్రాలుగా నిలుస్తాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ, సియా గౌతమ్ జంటగా తెరకెక్కిన 'నేనింతే' మూవీ అలాంటిదే. 2008, DEC 19న విడుదలైన ఈ చిత్రానికి నేటితో 15ఏళ్లు పూర్తయ్యాయి. సినీ పరిశ్రమలో జనాల కష్టాలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపారు పూరి. అప్పట్లో ఓ మాదిరిగానే ఆడినా, ఇప్పుడు చాలామందికి ఇష్టమైన సినిమాగా నిలిచిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa