ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో విడుదల కానున్న 'హనుమాన్' ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 18, 2023, 04:57 PM

యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన భారతీయ సూపర్ హీరో చిత్రం 'హనుమాన్' లో తేజ సజ్జ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో తేజకు జోడీగా అమృత అయ్యర్ జోడిగా నటిస్తోంది. తాజాగా మూవీ మేకర్స్ హైదరాబాద్ లోని AMB సినిమాస్ లో ఉదయం 10 గంటలకు జరుగనున్న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.   

ఈ పాన్ ఇండియా చిత్రం జనవరి 12, 2024న వెండితెరపైకి రానుంది. అమృత అయ్యర్ ఈ సినిమాలో తేజ సరసన నటిస్తుంది. డాక్టర్, ఓ మై డాగ్ చిత్రాలలో విలన్ పాత్రను పోషించిన వినయ్ రాయ్ ఈ సినిమాలో మైఖేల్ అనే విలన్ పాత్రలో నటిస్తున్నారు. అనుదీప్ దేవ్, హరి గౌర, జై క్రిష్ మరియు కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లు అందిస్తున్నారు. కె నిరంజన్ రెడ్డి తన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై హను-మాన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa