థ్రిల్లర్ సినిమాలకు పేరుగాంచిన టాలీవుడ్ నటుడు అడివి శేష్ తన తదుపరి సినిమాని షానీల్ డియోనితో చేస్తున్నట్లు ప్రకటించారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో శేష్ క్రేజీ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి 'డకాయిట్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వస్తున్నాయి. అతి త్వరలో మూవీ మేకర్స్ నుండి అధికారిక ధృవీకరణ చేయబడుతుంది. ఈ సినిమాలో స్టార్ నటి శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌పై సుర్ప్రియ, ఏషియన్ సినిమాస్‌పై సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa