ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'గుంటూరు కారం' పై వస్తున్న రూమర్స్ పై స్పందించిన నాగ వంశీ

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 18, 2023, 03:18 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీకి 'గుంటూరు కారం' అని టైటిల్ మూవీ మేకర్స్ లాక్ చేసారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్రబృందం ప్రమోషనల్ మెటీరియల్‌ని విడుదల చేయడం ప్రారంభించింది. కొన్ని రోజుల క్రితం, చిత్ర బృందం ఈ సినిమాలోని రెండవ పాటను విడుదల చేసారు. ఆ పాట అంతగా లేకపోవడంతో ఫ్యాన్స్‌కు సంతృప్తి కలగలేదు. సోషల్ మీడియాలో మేకర్స్‌ని ట్రోల్ చేయడం కూడా మొదలుపెట్టారు.

అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోయే పాటల పట్ల సంతోషంగా లేరని వాటిపై రీవర్క్ చేయమని టీమ్‌ని కోరినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ పుకార్లపై నిర్మాత నాగ వంశీ విసిగిపోయి వాటిని తీవ్రంగా ఖండించారు. సినిమాలో 4 పాటలు, 1 బిట్ సాంగ్ ఉన్నాయని అందులో 3 పాటలు, ఒక బిట్ సాంగ్ షూట్ పూర్తి చేశామని ఆయన చెప్పారు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 21 నుంచి మిగిలిన పాటల చిత్రీకరణ జరుగుతుందని ఆయన తెలిపారు.

ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ జనవరి 12న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు, రమ్య కృష్ణన్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్ మరియు ఇతరులు కీలక పాత్రలలో నటించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa