లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ 171వ చిత్రాన్ని చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర కోసం లోకేష్ కనగరాజ్ బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌ను సంప్రదించగా స్టార్ నటుడు ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం.
షారుఖ్‌కి సబ్జెక్ట్ నచ్చిన ఆ పాత్రకు నో చెప్పాడు. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించనున్న తన కుమార్తె సుహానా ఖాన్ తొలి చిత్రంలో అతను ఇప్పటికే ప్రత్యేక పాత్రను పోషిస్తున్నాడు. ఇటీవల, SRK టైగర్ 3 మరియు బ్రహ్మాస్త్రలో అతిధి పాత్రలో కనిపించాడు. అందుకే ఇకపై మరిన్ని ప్రత్యేక పాత్రలు చేయకూడదని సూపర్‌స్టార్ నిర్ణయించుకున్నాడు అని టాక్.
తలైవర్ 171 వచ్చే ఏడాది వేసవి నుండి సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa