లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ 171వ చిత్రాన్ని చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ.... రజనీకాంత్‌తో సినిమా హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఉంటుంది అని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌తో తాను కొత్తగా ట్రై చేస్తున్నానని చెప్పాడు. కథనం తర్వాత రజనీకాంత్ తనను కౌగిలించుకున్నారని లోకేష్ కనగరాజ్ వెల్లడించారు మరియు ప్రాజెక్ట్ కిక్‌స్టార్ట్ చేయడానికి నటుడు చాలా ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ లో ప్రముఖ హీరో శివకార్తికేయన్ కీలక పాత్రలో నటించనున్నాడని కోలీవుడ్ సర్కిల్స్‌లో లేటెస్ట్ టాక్. తలైవర్ 171 వచ్చే ఏడాది వేసవి నుండి సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa