సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శకుడు TJ జ్ఞానవేల్ తో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా ఈ చిత్రానికి 'వేట్టైయన్' అనే టైటిల్‌ను ఖరారు చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న రితికా సింగ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది.
ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్, రితికా సింగ్, మంజు వారియర్, దుషార విజయన్ మరియు ఇతరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa