ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ వారంతో ముగియనున్న బిగ్ బాస్ సీజన్‌ 7

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 16, 2023, 03:26 PM

బిగ్‌ బాస్‌ సీజన్‌ 7లో ఈ వారంతో ముగుస్తోంది. టైటిల్‌ గెలుచుకునేది ఎవరన్నది తెలియడానికి కొన్ని గంటలు మాత్రమే ఉంది. ప్రస్తుతం హౌస్‌లో ఆరు మంది ఉన్నారు. అంతా ఫన్ మోడ్‌లో ఉన్నారు. అయితే గతంలో లాగా గుంపులుగా ఉండి ముచ్చట్లు పెట్టుకోవడానికి ఆసక్తిగా ఎవరూ కనిపించడం లేదు. గత సీజన్ లతో పోలిస్తే ఫినాలే జరిగే వీక్‌ ఇంత చప్పగా లేదు. హౌస్‌లో కొందరే ఉండడంతో బోర్‌ ఫీలవుతున్నట్లు అనిపిస్తోంది. వాళ్లు బోర్‌ ఫీలవతూ, ఆడియన్స్ కు కూడా బోర్‌ కొట్టిస్తున్నారు. అందుకే బిగ్‌ బాస్‌.. కంటెస్టెంట్స్‌కు మోటివేషన్‌ ఇచ్చారు. లక్ష్యానికి చేరువ అవుతున్నప్పుడు రెట్టింపు ఉత్సాహం చూపించాలని చెప్పారు. విన్నర్‌ అనేవాడు ఇలా ఉండడు అని అన్నారు.. అంతే కాకుండా కంటెస్టెంట్స్‌ చేత ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయించడం కోసం వారికి వివిధ టాస్కులు ఇస్తున్నాడు.ఈ టాస్క్స్ మధ్యలో గ్లామర్‌ యాంకర్‌ శ్రీముఖి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంటి సభ్యులను కలిసింది. ఈ సీజన పూర్తయ్యాక సూపర్‌సింగర్స్‌ కొత్త సీజన్ స్టార్ట్‌ అవుతోందని తెలిపింది. అందుకోసం ఇంటి సభ్యులను ఆడిషన్ చేయడానికి వచ్చానని చెప్పింది. తను పెట్టిన పోటీలో ఓడిపోతే హగ్‌ ఇస్తా.. గెలిస్తే గట్టి హగ్‌ ఇస్తా’ అని చెప్పి పాటల పోటీ పెట్టింది. ఆ మాటలో హౌస్‌లో ఉన్న అందరికీ రెట్టింపు ఉత్సాహం వచ్చింది. తర్వాత ట్రూత ఆర్‌ డేర్‌ గేమ్‌ ఆడించింది. అందులో డేట్‌, మ్యారేజ్‌, కిల్‌ ఎవరి కోసం అనగానే మ్యారేజ్‌ అయితే అశ్విని అని చెప్పాడు యావర్‌. తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమో హల్‌చల్‌ చేస్తోంది.తర్వాత ఇంటి సభ్యులకి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే.. ఈ టాస్క్‌లో అమర్‌దీప్‌ను జ్యోతిష్యుడిగా వ్యవహరించమన్నాడు. హౌజ్‌మేట్స్‌ అంతా ఒకరు తర్వాత ఒకరు వచ్చి జాతకం చెప్పించుకోవాలని సూచించాడు. దీంతో కంటెస్టెంట్స్‌ అంతా అమర్‌దీప్‌ను ఒక ఆట ఆడేసుకున్నారు. తను ఏం చెప్పినా రివర్స్‌ కౌంటర్లు వేస్తూ.. జోకులు వేస్తూ.. అమర్‌ను టార్గెట్‌ చేశారు. ముఖ్యంగా శివాజీ, అర్జున్‌ అయితే అమర్‌పై ఉన్న చనువుతో కాస్త ఎక్కువగానే మాట్లాడారు. అమర్‌ జాతకమంతా తనకు తెలుసని అర్జున్‌ అన్నాడు. తొందరలో ఏది రివీల్‌ చేస్తాడో అని అమర్‌.. తనను ఆపుతూ ఉన్నాడు. ఇక అమర్‌తో ఫన్‌ పూర్తయ్యిందని.. శివాజీని జ్యోతిష్యుడిగా వ్యవహరించమన్నారు బిగ్‌ బాస్‌. అందరినీ వదిలేసి ముందుగా అమర్‌ జాతకమే చెప్పాలని నిర్ణయించుకున్నాడు శివాజీ. దానికి అమర్‌ సహకరించకపోవడంతో చెంప పగలగొట్టి మరీ తనను కుదురుగా కూర్చోబెట్టాడు.ఇంట్లో ఫుడ్‌ టాస్క్‌ సగం వరకు మాత్రమే పూర్తయ్యింది. దీంతో శుక్రవారం ప్రసారమయిన ఎపిసోడ్‌లో మిగతా సగం పూర్తిచేయాలని బిగ్‌ బాస్‌కు వచ్చిన గ్రహంతరవాసి హాచీ నిర్ణయించుకుంది. పల్లవి ప్రశాంత్‌, ప్రియాంక, యావర్‌లకు ఇంకా ఇంటి ఫుడ్‌ రాకపోవడంతో వారి తరపున అమర్‌దీప్‌, అర్జున్‌, శివాజీలను బాల్స్‌ పజిల్‌ ఆడమంది. ఇప్పటికే ఫినాలే అసా్త్ర కోసం అర్జున్‌, అమర్‌ ఆ టాస్క్‌ను ఆడేశారు. వారికి ఎక్స్‌పీరియన్స్‌ ఉంది కాబట్టి టాస్క్‌ ర్క్ష?రం్ఘ?్‌మయిన వెంటనే వేగంగా ఆడడం మొద?నిపెట్టారు. శివాజీ మాత్రం కన్పూ?్యజ్‌ అయ్యాడు. అందరికంటే ముందుగా అమర్‌దీప్‌.. టాస్కును గెలిచి యావర్‌కు ఇంటి ఫుడ్‌ అందించమని కోరాడు. కానీ యావర్‌కు ఫుడ్‌ ఇవ్వడానికి హాచీ ఒక కండీషన్‌ పెట్టాడు. తను కేవలం ఒక్క హౌజ్‌మేట్‌తో మాత్రమే ఆ ఫుడ్‌ను షేర్‌ చేసుకోవచ్చని అన్నాడు. యావర్‌.. దానికి ఒప్పుకోలేదు, అందరితో పంచుకుంటున్నానని చెప్పాడు. హాచీ దానికి ఒప్పుకోలేదు. యావర్‌ కూడా మొండిగా తన మాటపై నిలబడ్డాడు. దీంతో ఇంటి ఫుడ్‌ తనకు దక్కదని హాచీ తేల్చేశాడు. తను చెప్పిన వినకుండా యావర్‌.. తన ఇంటి ఫుడ్‌ను పోగొట్టుకోవడంతో శివాజీకి కోపం వచ్చింది. ‘‘నాకొక విషయం అర్థమయ్యింది. ఇక్కడ ఎవరూ ఎవరి మాట వినరు. యావర్‌ ేసఫ్‌ గేమ్‌ ఆడాడు. ఒకరిని సెలక్ట్‌ చేసుకుంటే మిగతావారు ఫీల్‌ అవుతారని అనుకున్నాడు’’ అని తన అభిప్రాయాన్ని తెలిపాడు. హాచీ ఇచ్చిన తరువాతి టాస్కులో అర్జున్‌ గెలిచాడు. దీంతో పల్లవి ప్రశాంత్‌కు ఇంటి ఫుడ్‌ను పంపమని కోరాడు. యావర్‌కు పెట్టినట్టుగానే ప్రశాంత్‌కు కూడా కండీషన్‌ పెట్టాడు హాచీ. తన ఫుడ్‌ను కేవలం ఒక్క హౌజ్‌మేట్‌తో మాత్రమే పంచుకోమని చెప్పాడు. దీంతో ప్రశాంత్‌.. అమర్‌ పేరు చెప్పాడు. ఇద్దరు కలిసి ఇంటి ఫుడ్‌ను తిన్నారు. ఇక ప్రస్తుతం హౌజ్‌లో ఆరుగురి మ్యూచువల్‌ ఫండ్స్‌ ఖాతాలో కొన్ని పాయింట్స్‌ ఉన్నాయి. అమర్‌ ఖాతాలో అందరికంటే ఎక్కువ పాయింట్స్‌ దగ్గర ఉన్నాయి. ఆ పాయింట్స్‌ అన్నీ ఇచ్చేేస్త.. తమ ఫ్యామిలీలోని ఒకరితో వీడియో కాల్‌ మాట్లాడే అవకాశం ఉంటుందని బిగ్‌ బాస్‌ తెలిపాడు. అలా అమర్‌కు తేజస్వినితో వీడియో కాల్‌ మాట్లాడే అవకాశం వచ్చింది. డిసెంబర్‌ 14న వారి మొదటి వెడ్డింగ్‌ యానివర్సిరీ కావడంతో ఒకరినొకరు విష్‌ చేసుకున్నారు. ధైర్యంగా ఆడమంటూ అమర్‌కు ధైర్యం చెప్పింది తేజస్విని. ఇక ఈ టాస్కుల మధ్యలో శివాజీ తీరు మాత్రం ఏమీ మారలేదనే చెప్పాలి. తనకు ఎంతో క్లోజ్‌ అయిన యావర్‌ గురించి కూడా వెనక కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa