టాలీవుడ్ యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ ప్రముఖ నటి లావణ్య త్రిపాఠితో నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీలో వివాహం చేసుకున్నారు. ఈ సెలబ్రిటీ జంట ప్రస్తుతం ఫిన్‌లాండ్‌లో ఉన్నారు. ఈ జంట మంచు ప్రాంతంలో స్కీయింగ్ చేస్తున్న చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వరుణ్ తేజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో 'మంచి మంచు లాంటిది ఏమీ లేదు' అనే క్యాప్షన్ తో ఈ పిక్ ని పోస్ట్ చేసాడు. వర్క్ ఫ్రంట్ లో చూస్తే, వరుణ్ తేజ్ తదుపరి చిత్రం ఆపరేషన్ వాలెంటైన్‌లో కనిపించనున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa