సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి రూపుదిద్దుకుంటోన్న సినిమా ‘గుంటూరు కారం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చిన్నబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు నెలకొని ఉన్నాయో తెలియంది కాదు. సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘ఓ మై బేబీ’ ని విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. పాట విషయానికి వస్తే.. త్రివిక్రమ్-మహేష్ బాబు, త్రివిక్రమ్-థమన్ కాంబినేషన్‌లో పలు చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లు వచ్చాయి. ఇప్పుడు ‘గుంటూరు కారం’ కూడా మరో భారీ చార్ట్ బస్టర్ అవుతుందనేలా.. ఇప్పటికే విడుదలైన ‘ధమ్ మసాలా’, తాజాగా విడుదలైన ‘ఓ మై బేబీ’ పాటలు చెబుతున్నాయి. ఈ పాట శీతాకాలపు ఉదయం ఆనందకరమైన మెలోడీని వింటూ పొగలు కక్కే కాఫీ తాగుతున్న అనుభూతిని కలిగిస్తుందని చిత్రబృందం చెబుతోంది. ఇంతకు ముందు వచ్చిన ‘థమ్ మసాలా’ సాంగ్‌లానే.. ఈ మెలోడీ గీతానికి కూడా అద్భుతమైన స్పందన లభిస్తుందని సంగీత దర్శకుడు ఎస్. థమన్ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa