ప్రతివారం రెండు మూడు డబ్బింగ్ చిత్రాలు ఓటీటీలోకి వస్తుండగా ఈవారం మళయాళ కామెడీ చిత్రం శేషం మైక్-ఇల్ ఫాతిమా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. నవంబర్ 17న విడుదలైన ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా, ఫెమినా జార్జ్ , షాహీన్ సిద్ధిఖ్ ప్రధాన పాత్రల్లో నటించగా మను కుమార్ దర్శకత్వం వహించారు. తెలుగులో ఖుషి,హాయ్ నాన్న, మళయాళంలో హృదయం వంటిచిత్రాలకు సంగీతం అందించిన హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. అరుదుగా కథానాయిక ప్రధాన పాత్రగా ప్రత్యేక స్పోర్ట్స్ డ్రామా జానర్‌లో వచ్చిన ఈ చిత్రం మలయాళ నాట మంచి విజయాన్నే సాధించింది. చిన్నప్పటి నుంచి ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూస్తూ ఆటపై ఇష్టం పెంచుకున్న ఓ ముస్లిం యువతి నూర్జహాన్ ఎలాగైనా ఇండియన్ ఫెడరేషన్ లీగ్‌లో వ్యాఖ్యాతగా ఎంపిక కావాలని లక్ష్యంగా పెట్టుకుంటుంది. కుటుంబంలో సోదరుడు మినహా కుటుంబం అడ్డు చెప్పడం, ఈ క్రమంలో తన కలను సాకారం చేసుకోవడానికి సదరు యువతి ఎదుర్కొనే అడ్డంకులు, బెదిరింపులు నేపథ్యంలో ఈ చిత్రం వినోదాత్మకంగా రూపొందిచబడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa