బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్‌లకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు పంపింది. గుట్కా సంస్థల ప్రకటనలకు వారు ప్రచాకర్తలుగా ఉండడంతో ఈ నోటీసులు పంపినట్లు కేంద్రం పేర్కొంది. ఓ పిటిషన్ విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టుకు శనివారం ఈ విషయాన్ని కేంద్రం తెలిపింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణలో ఉందని, హైకోర్టులో దాఖలైన పిటిషన్ కొట్టేయాలని కోరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa