ది వాండరింగ్ ఎర్త్ 2 అనే చైనీస్ సైన్స్ ఫిక్షన్, యాక్షన్ అడ్వెంచర్ సినిమా ఓటీటీలో దుమ్ము రేపుతున్నది. 2023 జనవరి 22న విడుదలైన ఈ సినిమాలో ఆండీ లౌ, వు జింగ్ ప్రధాన పాత్రల్లో నటించగా ఫ్రాంట్ గ్వో దర్శకత్వం చేశారు. ఇప్పటికే ఈ చిత్రం మొదటి భాగం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతుండగా తాజాగా ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ వచ్చి మంచి ఆదరణ పొందుతున్నది. చైనా ఫస్ట్ ఎపిక్ సైంటిఫిక్ చిత్రంగా హాలీవుడ్ స్థాయిలో రూపొంది ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమాగా పేరు తెచ్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన టాప్ టెన్ చిత్రాల్లో మిషన్ ఇంపాజిబుల్ ను కూడా క్రాస్ చేసి 8వ స్థానంలో ఉన్నదంటే ఈ చిత్రం ఏ స్థాయి విజయం సాధించిందో అర్ధమవుతుంది. దాదాపు 2 గంటల 50 నిమిషాల నిడివితో ఉన్న ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ లో రెంట్ పద్దతిలో తెలుగులోనూ డిజిటల్ స్ట్రీమింగ్ జరుగుతున్నది. ఇక కథ విషయానికి వస్తే 2044 సంవత్సరం నాటికి సూర్యుడు రోజురోజుకు పరిమానంలో విస్తరిస్తూ తన ఉనికిని కోల్పోవడమే కాకుండా భూమికి దగ్గరగా వస్తుండడంతో భూమిని కాపాడేందుకు ఓ బృందం చేసిన సాహాసాల ఇతివృత్తంలో చిత్రం ఆధ్యంతం ఆకట్టుకుంటుంది. గ్రాఫిక్స్ కట్టిపడేస్తాయి అంతేగాక ఈ సినిమాలో ఎలాంటి మసాలా సన్నివేశాలు ఉండకపోవడంతో ఇంటిల్లిపాది కలిసి హాయిగా వీక్షించవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa