తలపతి విజయ్ లియో ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల గ్రాస్ వసూలు చేసి మెగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా నచ్చని వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా, ఈ సినిమా ఫ్లాష్‌బ్యాక్ పోర్షన్‌లు నెగటివ్ రివ్యూస్ ని అందుకున్నాయి.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి చెందిన నాగ వంశీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా తనకు నచ్చలేదని చెప్పాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసింది నాగ వంశీ. ఈ ఇంటర్వ్యూలో నాగ వంశీని ఈ ఏడాది తనకు నచ్చిన సినిమాల గురించి మాట్లాడమని అడిగారు. రజనీకాంత్ జైలర్ ఎంగేజింగ్‌గా ఉందని నిర్మాత తెలిపారు.
లియో గురించి ఇంటర్వ్యూయర్ నాగ వంశీని అడిగినప్పుడు, ఆ సినిమా తనకు పని చేయలేదని చెప్పాడు. పాత ప్రెస్ మీట్‌లో, నాగ వంశీ తాను లియో ద్వారా లాభాలను సంపాదించానని పేర్కొన్నాడు మరియు సినిమా కంటెంట్‌తో తనకు ఎటువంటి సంబంధం లేదని దానిని డిస్ట్రిబ్యూట్ మాత్రం చేశామని వెల్లడించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa