ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'హాయ్ నాన్నా' ని భారీగా ప్రమోట్ చేస్తున్న నాని

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 27, 2023, 08:54 PM

నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని తన 30వ చిత్రాన్ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'హాయ్ నాన్నా' అనే టైటిల్‌ను మూవీ మేకర్స్ ఖరారు చేసారు. ఇటీవల మూవీ మేకర్స్ విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించింది. నాని ఈ సినిమాని భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు. చెన్నైలో, కొచ్చిలో ఈ సినిమా ప్రమోషన్‌కు వెళ్లారు. తాజాగా ఈరోజు బెంగుళూరులో కూడా ఈ మూవీ ప్రొమోషన్స్ లో జాయిన్ అయ్యారు.

శ్రుతిహాసన్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో నాని సింగిల్‌ ఫాదర్‌గా కనిపించనున్నాడు. ఈ పాన్-ఇండియన్ చిత్రంలో బేబీ కియారా, జయరామ్, ప్రియదర్శి, శ్రుతి హాసన్ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబర్ 7, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. సీతా రామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో నానికి జోడిగా నటిస్తుంది.


ప్రముఖ మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హృదయం ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల మరియు మూర్తి KS ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa