నైట్రో స్టార్ సుధీర్ బాబు తన తదుపరి సినిమాని సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి హరోమ్ హర: ది రివోల్ట్ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన జోడిగా మాళవిక శర్మ నటిస్తుంది. తాజాగా పాన్-ఇండియన్ నటుడు ప్రభాస్ ఈరోజు ఈ సినిమా తెలుగు టీజర్‌ను విడుదల చేసారు.
రవితేజ గిరిజాల ఎడిటింగ్ అందించిన ఈ చిత్రానికి అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. సునీల్, జయ ప్రకాష్, అక్షర, అర్జున్ గౌడ్, లక్కీ లక్ష్మణ్, రవి కాలే తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నారు. శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై సుమంత్ నాయుడు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa