టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ సినిమాటోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమ్నేనితో తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్ కి 'ఈగిల్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా వీడియో గ్లింప్స్‌కి అభిమానులు మరియు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తుంది.
తాజాగా ఇప్పుడు, రవితేజ తన తదుపరి సినిమాని కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి చేయటానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా కొత్త అమ్మాయిని ఎంపిక చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన దర్శకుడి గురించి మరియు ఇతర వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa