తన తొలి కమర్షియల్ హిట్ ఇస్మార్ట్ శంకర్‌తో సూపర్‌స్టార్‌డమ్‌కి ఎదిగిన నభా నటేష్ తన చివరి చిత్రం మాస్ట్రో తర్వాత పెద్ద స్క్రీన్ నుండి కొంత విరామం తీసుకుంది. నభా నటేష్ వెండితెరపైకి తిరిగి రావడానికి ఒక ఎంటర్‌టైనర్‌ను ఎంచుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి కోలీవుడ్ ఫిల్మ్ మేకర్ అశ్విన్ రామ్ దర్శకత్వం వహించనున్నారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రంలో ప్రధాన నటుడుగా ప్రియదర్శిని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. రానున్న రోజులల్లో ఈ విషయం గురించి మూవీ మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa