కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి మరియు ఐరా ప్రధాన పాత్రలలో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'అథర్వ' సినిమా ప్రొమోషన్స్ కంటెంట్‌తో సంచలనాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ట్రైలర్ సినిమాకి సంబంధించిన పర్ఫెక్ట్ సెట్ అప్ క్రియేట్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. 'కంటి చొప్పే పడ్డ దాంటే..' అంటూ సాగే 'కెసిపిడి' అనే మాస్ సాంగ్‌ని మూవీ టీమ్ విడుదల చేసింది. ఈ పాట ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. గ్రామీణ ప్రాంతంలో భారీ స్టెప్పులతో చిత్రీకరించిన ఈ పాటను శ్రీ చరణ్ పాకాల పాడారు.
అథర్వ చిత్రానికి మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుభాష్ నూతలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 1న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa