అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ ఇటీవల నటించిన 'భగవంత్ కేసరి' సినిమా బాక్స్ఆఫీస్ వద్ద దసరా విజేతగా నిలిచింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా OTT ప్రేక్షకులను అలరించడానికి ఈరోజు డిజిటల్ రంగప్రవేశం చేసింది. ఈ చిత్రం తెలుగుతో పాటు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషలలో, ఆంగ్ల ఉపశీర్షికలతో అందుబాటులో ఉంది.
ఈ చిత్రంలో బాలకృష్ణకి జోడిగా కాజల్ అగర్వాల్ నటించింది. ఈ సినిమాలో శ్రీలీల, శరత్‌కుమార్, అర్జున్ రాంపాల్, జీవన్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ నిర్మించింది. థమన్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లను అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa