తెలుగు వెండితెర నటి రష్మిక డీప్‌ఫేక్ వీడియోపై కీలక ఆధారాలు లభించాయని, టెక్నాలజీ ఉపయోగించి పరిశీలిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఏ ఐపీ అడ్రస్‌ల నుంచి వీడియో అప్‌లోడ్ చేశారో గుర్తిస్తున్నామని డీసీపీ హేమంత్ తివారీ తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. వివాదాస్పద వీడియో వైరల్ కావడంతో, ఢిల్లీ మహిళా కమిషన్ నుండి పోలీసులకు నోటీసులు అందాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa