డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‌తో సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి 'యానిమల్' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసారు. అయితే మంచి కంటెంట్‌ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే రెబల్ స్టార్ ప్రభాస్ యానిమల్ ట్రైలర్ చూసి ఈరోజు మధ్యాహ్నం "వాట్ ఎ ట్రైలర్, వాట్ ఎ ఫీల్, ఎక్స్‌ట్రార్డినరీ... మెంటల్... కంగ్రాట్యులేషన్స్ అండ్ కాంట్ వెయిట్ ఫర్ యానిమల్" అని పోస్ట్ చేశాడు.
ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక రణబీర్‌తో రొమాన్స్ చేయనుంది. యానిమల్ డిసెంబర్ 1, 2023న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల కానుంది. రణబీర్ కపూర్ ఈ సినిమాలో ఇంటెన్సివ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ అండ్ సినీ1 స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa