తమిళ స్టార్ హీరో సూర్య షూటింగ్ లో గాయపడ్డారు. ఆయన తాజా నటిస్తున్న 'కంగువా' సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో కెమెరా సూర్యపై పడింది. ఈ ప్రమాదంలో సూర్య భుజానికి గాయమైంది. షూటింగ్ సమయంలో సూర్య గాయపడిన మాట వాస్తవమేనని, అయితే పెద్దగా గాయం కాలేదని నిర్మాతల నుంచి సమాచారం అందిందని అన్నారు. ప్రస్తుతం సూర్యపరిస్థితి బాగానే ఉందని, కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు వెల్లడించారు. ఈ సినిమాని జ్ఞానవేల్ రాజాతో కలిసి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa