టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంట్ హీరో నితిన్ తన 32వ చిత్రాన్ని రచయిత-దర్శకుడు వక్కంతం వంశీతో చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్ ఫిల్మ్‌లో నితిన్‌కి జోడిగా శ్రీలీల నటించనుంది. ఈ చిత్రానికి 'ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, చిత్ర బృందం ప్రస్తుతం నితిన్ మరియు శ్రీలీలతో ఈ సినిమాలోని హై-ఎనర్జీ మాస్ పాటను చిత్రీకరిస్తోంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో 300 మందికి పైగా మహిళా డ్యాన్సర్లు ఈ సాంగ్ లో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోంది.
డిసెంబర్ 8, 2023న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. రాజశేఖర్, రావు రమేష్, సంపత్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నితిన్ 32ని సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. హారిస్ జైరాజ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa