ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'RC16' గురించిన లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 23, 2023, 02:52 PM

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని చేయనున్న సంగతి అందరికి తెలిసందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం, సాయి పల్లవి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఇప్పుడు, సాయి పల్లవిని హీరోయిన్ గా కన్ఫర్మ్ చేయలేదని ఇంకా బుచ్చిబాబు సానా హీరోయిన్‌ని లాక్ చేయలేదని సమాచారం.


అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకి AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. గ్రామీణ స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa