మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ఇటీవల కన్నూర్ స్క్వాడ్‌తో గణనీయమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. తాజాగా ఇప్పుడు, కాదల్: ది కోర్ అనే సినిమాతో మరోసారి తన అభిమానులను మరియు సినీ ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రం నవంబర్ 23, 2023న పెద్ద స్క్రీన్‌లో విడుదలకి సిద్ధంగా ఉంది. అయితే, హోమో సెక్సువల్ కంటెంట్ ని చేర్చడం వల్ల ఈ సినిమా ఖతార్ మరియు కువైట్‌లలో నిషేధాన్ని ఎదురుకుంటుంది.
ఈ మలయాళ చిత్రంలో జ్యోతిక కథానాయికగా నటిస్తుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్‌కు ప్రసిద్ధి చెందిన జో బేబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మమ్ముట్టి కంపానీ మరియు వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌లపై నిర్మించబడింది. ఈ ప్రాజెక్ట్ కి మాథ్యూస్ పులికాన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa