ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డులను బ్రేక్ చేస్తున్న 'జవాన్'

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 22, 2023, 07:20 PM

సౌత్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమా సెప్టెంబర్ 7, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన తర్వాత ఈ సినిమా OTTలో కూడా కొత్త రికార్డులను సృష్టిస్తోంది. షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 2న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రదర్శించబడింది. మొదటి రెండు వారాల్లో భారతదేశంలో అత్యధికంగా వీక్షించిన చిత్రంగా జవాన్ అని డిజిటల్ ప్లాట్ఫారం ప్రకటించింది. గతంలో RRR, గంగూబాయి కతియావాడి, మరియు చోర్ నికల్ కే బాగా వంటి చిత్రాలు ఈ రికార్డును కలిగి ఉన్నాయి.

ఈ మూవీలో షారూఖ్ ఖాన్ సరసన జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా అండ్ సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa