కార్తికేయ 2 దర్శకుడు చందూ మొండేటితో నాగ చైతన్య తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. సూపర్‌హిట్ మూవీ లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది.
తాజాగా మూవీ మేకర్స్ నాగ చైతన్య ఫస్ట్-లుక్ పోస్టర్‌ను రివీల్ చేసి అభిమానులకు సాలిడ్ సర్ప్రైజ్ ఇచ్చారు. అలాగే ఈ చిత్రానికి 'తాండల్' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు వెల్లడించారు. నాగ చైతన్య పడవపై కూర్చొని ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అద్భుతంగా ఉంది. రగ్డ్ లుక్‌లో నాగ చైతన్య అద్భుతంగా కనిపిస్తున్నాడు.
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభమవుతుంది. GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa