సుధీర్ బుల్లితెరపై యాంకర్‌గా బిజీగా ఉంటూనే సినిమాల్లోనూహీరోగా అవకాశాలు అందుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన చిత్రం 'కాలింగ్ సహస్ర’. అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సుధీర్ సరసన డాలీ కథానాయికగా నటించింది. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుందీ. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఈ రోజుల్లో ఒక సినిమా హిట్ అయితే దానికి ముఖ్య కారణం కంటెంట్. మా సినిమాకు కథే బలం. సుధీర్‌ని దృష్టిలో పెట్టుకుని కాకుండా ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలని వెళ్తే ఈ సినిమాను కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. హీరోగా నా మూడో చిత్రమిది. నా సినిమాలకు నిర్మాతలకు లాభాలు వస్తే చాలు. అలాగే సినిమాలు నచ్చితే అదే విషయాన్ని పాజిటివ్‌గా మాట్లాడుకుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది’’ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa