ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సారంగదరియా' టైటిల్ పోస్టర్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 22, 2023, 01:57 PM

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో ఉమాదేవి శరత్ చంద్ర నిర్మాతలూ గా పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం  'సారంగదరియా' ఈ చిత్రం టైటిల్ పోస్టర్ ను  రాజ్ తరుణ్ చేతుల విడుదల చేసారు. ఈ సందర్బంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ "సారంగదరియా ఫస్ట్ లుక్ పోస్టర్ నేను విడుదల చెయ్యడం చాలా సంతోషంగా ఉంది పోస్టర్ అండ్ టైటిల్ చూడగానే పాజిటివ్ గా చాలా బాగుంది అనిపించింది.  ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా  త్వరలో విడుదల కానున్న ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటిస్తున్న రాజా రవీంద్ర మంచి పాత్ర పోషించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరిస్తుంది" అని అన్నారు. డైరెక్టర్ పద్మారావు అబ్బిశెట్టి(పండు )మాట్లాడుతూ "దర్శకుడిగా తొలి చిత్రమిది. మధ్యతరగతి ఫ్యామిలీ లో జరిగిన కొన్ని ఘర్షణల తో ఈ సినిమా ఉంటుంది.  త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం" అని అన్నారు. రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ ,మోహిత్,  నీల ప్రియా, కాదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు ,విజయమ్మ , హర్షవర్ధన్,  తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి  డైలాగ్స్-వినయ్ కొట్టి, ఎడిటర్ - రాకేష్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ - M. ఎబెనెజర్ పాల్ సినిమాటోగ్రఫీ - సిద్ధార్థ స్వయంభు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa